రేపే గురుకుల ప్రవేశ పరీక్ష

W.G: మహాత్మాజ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో చేరేందుకు ఈ నెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.