'రాజాసాబ్' టికెట్ బుకింగ్స్ ఓపెన్.. ఎప్పుడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ 'రాజాసాబ్'. వచ్చే ఏడాది జనవరి 9న ఇది రిలీజ్ కానుంది. అయితే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ షోలు జనవరి 8న వేయనున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. అక్కడ డిసెంబర్ 4 నుంచి ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.