మాతా శిశు మరణాలపై డీఎంహెచ్‌వో సమీక్ష

మాతా శిశు మరణాలపై డీఎంహెచ్‌వో సమీక్ష

ATP: అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా DMHO డా.దేవి అధ్యక్షతన మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాలో నమోదైన ఆరు శిశు మరణాలపై అధికారులు సమీక్షించారు. హైరిస్క్ కేసుల పట్ల సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై డీఎంహెచ్‌వో ఆరా తీశారు. గర్భిణీ సేవలు, ప్రసవానంతర సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.