కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్‌ మృతి

కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్‌ మృతి

HYD: జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో రోషన్ సింగ్‌పై బాల్‌రెడ్డి అనే మరో రౌడీషీటర్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ హత్యకు మరో ఇద్దరు దుండగులు సహకరించారు. నిందితులను పోలీసులు పట్టుకుని విచారించగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.