రుద్రవరం అగ్ని ప్రమాదం.. గుడిసె దగ్ధం

రుద్రవరం అగ్ని ప్రమాదం.. గుడిసె దగ్ధం

NDL: రుద్రవరం మండలం హరినగరంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేతి కనకమ్మ గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో దుస్తులు, వంట సామాగ్రి, టీవీ కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని గ్రామస్థులు పేర్కొన్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో స్థానికులు వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారు.