VIDEO: అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం
NZB: జిల్లాలోని లింబాద్రి గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని మాడ విధుల గుండా ఊరేగించి, గోవిందా నామస్మరణం మధ్య అర్చకుల చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.