నాసా తిరస్కరించినా తగ్గని క్రిస్టినా పట్టుదల
మిషిగన్‌కు చెందిన క్రిస్టినాకు చిన్నప్పటి నుంచే నక్షత్రాలన్నా, అంతరిక్షమన్నా ప్రాణం. 2008లో నాసా తిరస్కరించినా నిరాశ చెందకుండా అంటార్కిటికా వంటి కఠిన ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తూ పట్టుదలతో శ్రమించారు. ఆ మొండి వైఖరే 2013లో ఆమెను వ్యోమగామిగా నిలబెట్టింది. ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో డిగ్రీలు చేసిన ఆమె ప్రస్థానం ఓటమిని ఎదురించి గెలవాలనుకునే వారికి నిరంతర స్ఫూర్తి.