కొత్త అధ్యక్షుడి ఎంపిక.. నేతలతో సంప్రదింపులు

కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక వేటలో బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు దాదాపు 100 మంది సీనియర్ నేతలను సంప్రదించినట్లు సమాచారం. బీహార్ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.