తాడిపత్రికి వెళ్లేందుకు యత్నించిన కేతిరెడ్డి

AP: తాడిపత్రికి వస్తున్న మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పుట్లూరు మండలం అరకటివేముల వద్ద కేతిరెడ్డిని పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా ఆపారు. దీంతో కేతిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనను తిరిగి అనంతపురానికి పంపించారు. కాగా నిన్న కూడా తాడిపత్రికి వెళ్లేందుకు యత్నించిన కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.