'నియోజకవర్గంలో చిల్లర రాజకీయాలు మానుకోవాలి'

MHBD: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి రెడ్యానాయక్ స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, సీఐపై నిప్పులు చెరిగారు. సమావేశంలో నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.