ప్రమాదం.. ఒకరు మృతి

అన్నమయ్య: చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్ వద్ద బుధవారం ద్విచక్రవాహనం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెంకి చెందిన హఫాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చిన్నమండెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.