VIDEO: పిడుగు పడి 14 గొర్రెలు మృతి
PLD: పెదకూరపాడు మండల పరిధిలోని గారపాడులో గురువారం సాయంకాలం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా పిడుగు పడటంతో గారపాడు గ్రామానికి చెందిన నల్లగొండ నాగమల్లేశ్వరరావు మేపుకునే 14 గొర్రెలు మృతి చెందాయని ఆయన తెలిపాడు. సుమారు మూడు లక్షలు విలువ కలిగిన జీవాలు చనిపోవడంతో నాగమల్లేశ్వరరావు కన్నీరు మున్నీరు అయ్యాడు.