జూపల్లి ఇంటిని ముట్టడించిన అంగన్‌వాడీలు

TG: తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు. కొల్లాపూర్ నుంచి అంగన్ వాడీలు రెండు కి.మీ కాలినడక మంత్రి ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రైమరీ విద్యను ICDS అంగన్ వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, విద్యాబోధన బాధ్యతను అంగన్ వాడీలకే అప్పగించాలని CITU డిమాండ్ చేసింది.