ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VKB: కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో దాని వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన హన్మయ్య (35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.