VIDEO: కారు, బైక్ ఢీ .. ఒకరు మృతి
MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాద్నగర్ నుంచి జడ్చర్ల వస్తున్న కారు ముందు వెళ్తున్న బైక్ ఒకదానికొకటి ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.