కేరళ బీజేపీ మేనిఫెస్టో విడుదల

కేరళ బీజేపీ మేనిఫెస్టో విడుదల

కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఏటా రెండు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.3 వేల పింఛన్, ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు, ఆర్థికంగా వెనకబడిన వారికి మందులు, నిత్యావసరాల కోసం నెలకు రూ.2,500 అందిస్తామని ప్రకటించింది. కాగా ఏప్రిల్ 9న పోలింగ్ జరగునుంది.