పురాణ కాలక్షేప మండపానికి శంకుస్థాపన

పురాణ కాలక్షేప మండపానికి శంకుస్థాపన

GNTR: పొన్నూరులోని శ్రీసాక్షి భావన్నారాయణ స్వామి, శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం పురాణ కాలక్షేప మండపం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ హాజరయ్యారు. ఆయన పురాణ కాలక్షేప మండపానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.