మహిళ సామాఖ్యా భవన స్లాబ్ ప్రారంభం
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన స్లాబ్ పనులను బుధవారం సర్పంచ్ జోగు రమణమ్మ పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యుల కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి శాశ్వత వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.