జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం
GNTR: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అనంతరం ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ , APSRTC బస్టాండ్లలో ఇవాళ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) ఏ. హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం ఈ తనిఖీలు నిర్వహించింది. అనుమానితులుగా గున్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.