విద్యుత్ పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లు తొలగించాలి: సీఎండి

విద్యుత్ పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లు తొలగించాలి: సీఎండి

HNK: టిజిఎన్ పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16సర్కిళ్ల ఎస్ ఈ, డిఈ ఆపరేషన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది నుంచి పోల్స్ ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవట్లేదని, విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. కేబుల్ వైర్లు రీ-అలైన్మెంట్ చేసుకోవాలని లేదంటే తొలగించాలని ఆదేశించారు.