తెనాలిలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం

తెనాలిలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం

GNTR: తెనాలి నాజరుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ప్రారంభించారు. పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యాలయం ద్వారా ప్రత్యేక అధికారిని నియమించి, గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.