నేడు కీలక కేసుల విచారణ
TPT: తిరుపతి వేదికగా సాగుతున్న పలు కీలక కేసులు సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టులో ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్, ఏ-29 సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది. మరో వైపు హై కోర్టులో పరకామణీ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.