VIDEO: పాకాలలో పర్యాటకుల సందడి..

WGL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపురం మండలం పాకాల సరస్సు పొంగిపొర్లుతోంది. పూర్తి నీటి సామర్థ్యం 30 అడుగులు దాటి.. ప్రస్తుతం మత్తడి పరవళ్లు తొక్కుతూ పాకాల అందాలను మరింత మంత్రముగ్ధులను చేస్తోంది. పర్యాటకుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. శుక్రవారం దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సరస్సు ఒడ్డున ఆహ్లాదంగా గడుపుతూ, బోటు సవారీ చేస్తూ గడిపారు.