'వీధి కుక్కల బెడద.. అధికారులు స్పందించాలి'
NLG: గ్రామాల్లో వీధి కుక్కల బెడద పెరుగుతున్నందున ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అంశల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా కుక్కలకు రేబీస్ వ్యాక్సినేషన్ నిర్వహించాలని, ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రుల్లో జంతువులకు అవసరమైన అన్ని టీకాలను అందుబాటులో ఉంచాలన్నారు.