'హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా తప్పదు'
ASR: ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని కిండ్ర జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణకు హెల్మెట్ ప్రాణరక్షక కవచంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.