బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : CPM
NGKL: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలని CPM అమ్రాబాద్ మండల కమిటీ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా CPM సీనియర్ నాయకులు మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లపై గతంలో నాన్చుడు ధోరణి అవలంబించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే న్యాయపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.