VIDEO: కన్నుల పండుగగా శ్రీకృష్ణుడి కళ్యాణోత్సవం
NLG: చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో గల ఆర్గానిక్ శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం శ్రీకృష్ణడి కళ్యాణోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాలతో.. కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా జరిగింది. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం, భజన కీర్తనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ నిర్వహకులు పామనగుండ్ల వెంకటేశ్వర్లు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.