కదిరి కొండ చుట్టూ భక్తుల గిరి ప్రదక్షిణ

కదిరి కొండ చుట్టూ భక్తుల గిరి ప్రదక్షిణ

సత్యసాయి: పవిత్రమైన కదిరి కొండ చుట్టూ శ్రీవారి భక్తులు మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం భక్తులు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.