VIDEO: గ్రామీణ హోమ్ ఫుడ్స్ షాపులో చోరీ
కడప నగరంలోని రాయచోటి రింగ్ రోడ్ సర్కిల్లో ఉన్న సాయిరాం హోమ్ ఫుడ్స్ షాపులో మంగళవారం దొంగతనం జరిగింది. షాపు యజమానికి ఒక బాక్స్ చూపించి, అది కావాలని అడగగా, ఆయన తీసుకుని వచ్చేలోపే ఒక బాలుడు నగదు బాక్సులో చేయి పెట్టి రూ. 30,000 నగదును దొంగిలించాడు. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. యజమాని గుర్తించేలోపే దొంగ పారిపోయాడు.