కూలిన కల్వర్టు.. మిసైతే ప్రాణాలు పోతాయ్..!
MHBD: కేసముద్రం మండల పరిధి పెనుగొండ నుంచి బ్రాహ్మణపల్లి వెళ్లే మార్గంలో కల్వర్టు కూలి ప్రమాదకరంగా మారింది. అసలే.. కల్వర్టు పక్కనే నీటి బావి ఉంది. రోడ్డుపై వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఏమాత్రం మిస్సైనా, ప్రయాణికులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లుగా అక్కడ ప్రజలు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.