హర్మూజ్ జలసంధిని దాటిన భారత్ నౌక

హర్మూజ్ జలసంధిని దాటిన భారత్ నౌక

గల్ఫ్‌ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో భారత్‌కు బయల్దేరిన మరో నౌక ‘జగ్‌ విక్రమ్‌’ హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈనౌక గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో ఇది భారత్‌కు చేరుకోనుంది. అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హర్మూజ్‌ను దాటిన మొట్ట మొదటి నౌక ఇదే.