కోటగుళ్లలో ములుగు జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు
BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కెకాన్ ఆదివారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.