ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు ఉద్యమం

ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు ఉద్యమం

MLG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర సమయం దగ్గరపడుతోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి, వంద రోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జాతర సమయంలో పంట నష్టపోతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ రైతాంగ పోరాటాన్ని బీఆర్ఎస్ వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.