VIDEO: సూర్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని ఉషాచాయ పద్మిని సహిత శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వైశాఖమాసం బహుళ శుద్ధ సప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. ఆలయ అర్చకులు నాని బాబు మాట్లాడుతూ.. ప్రత్యేక అలంకరణతో పాటు ఉదయం అభిషేకాలు నిర్వహించామని వివరించారు.