ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

GNTR: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 3వ విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు.ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని, ఆదే రోజు గుంటూరు, తెనాలి ఐటీఐ నమోదు కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.