నీట మునిగిన పంటలను పరిశీలించిన ADA

నీట మునిగిన పంటలను పరిశీలించిన ADA

KDP: పెద్దముడియం మండలంలోని పాలురులో కుందూనది దాటికి అన్నదాతలు సాగుచేసిన మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వాటిని బుధవారం మధ్యాహ్నం పొద్దుటూరు వ్యవసాయ ఏడీఏ అనిత, ఊటుకూరు శాస్త్రవేత్త మాధురి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడారు. మొక్కజొన్నలో ఉన్న నీళ్లను బయటకు పంపాలని, యూరియా, పొటాషియం చల్లాలని సలహా ఇచ్చారు.