కొండగట్టు ముడుపుల ఆదాయ వివరాలు వెల్లడి

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ముడుపులను ఆదివారం ఈవో శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో కొంత భాగం విప్పారు. ఈ ముడుపుల ద్వారా రూ. 85,094 నగదు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి రాజమౌళి, చంద్రశేఖర్, హరి హరనాథ్, పోలీసు సిబ్బంది, శ్రీ వల్లి సేవా సమితి పాల్గొన్నారు.