ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్ జనగామలో అవగాహన

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద వాహనదారులకు, ప్రజలకు జనగామ ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్ పై నేడు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.