'ప్రభుత్వ వైద్యశాలలో సేవలపై ఎమ్మెల్యే అసహనం'

NLR: నాయుడుపేటలోని ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం మధ్యాహ్నం సూళ్లూరు పేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆస్పత్రి బెడ్లలో బెడ్ షీట్లు లేకపోవడం, వైద్యశాలలో పరిస్థితులు గమనించి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వైద్య పరికరాలు నిరుపయోగంగా ఉండటం, ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను అన్ని విభాగాల వారితో వేరు వేరుగా మాట్లాడారు.