VIDEO: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
విశాఖలోని డైరీ ఫారం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.