VIDEO: 'అంగన్వాడీ భవనాల కోసం నిధులు మంజూరు చేయండి'
KKD: తుని నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో కోరారు. గత ప్రభుత్వంలో నిధులు డ్రా చేసినా భవనాలు పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. ఈ నిధులతో చిన్నారులు, గర్భిణులకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు.