స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అన్ని స్కూళ్లల్లో ఉదయం 10 గంటలకు వందేమాతరం గీతం ఆలపించాలని ఉత్తర్వులు పంపింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ తప్పనిసరిగా వందేమాతరం పాడాలని పేర్కొంది.