'మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలి'

'మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలి'

KMM: మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు అన్నారు. శుక్రవారం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. మధిర రైల్వే స్టేషన్‌ను విశాఖపట్నం జోన్‌లో కలపడం ద్వారా రైల్వే పరంగా మున్ముందు ఇబ్బందులు ఎదురు అవుతాయని చెప్పారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.