రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

SKLM: నందిగాం మండలం పాలవలసపేట సమీప జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి నుంచి నందిగాంకు వస్తున్న ఓ వ్యక్తి స్కూటీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.