VIDEO: పొగాకు రైతులను ఆదుకోవాలి: సీపీఎం

BPT: పొగాకు నాణ్యతలోపం పేరుతో రైతులను అధికారులు మభ్యపెడుతున్నారని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. శనివారం కర్లపాలెం ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద రైతులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆయనన్నారు.