టెన్త్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన MRO

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన MRO

W.G: మొగల్తూరు జిల్లా పరిషత్త్ హైస్కూల్ పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ రాజ కిషోర్ ఇవాళ అకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరుతో పాటు విద్యార్థుల హాజరు, సంబంధిత రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. మండలంలో పదో తరగతి పరీక్షలు అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు.