ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటాం: బీసీ ఇందిరారెడ్డి

ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటాం: బీసీ ఇందిరారెడ్డి

NDL: కొలిమిగుండ్ల మండలం, అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీరాభిమాని బండా నాగ ఆంజనేయులు శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బీసీ సతీమణి బీసీ ఇందిరా రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆంజనేయులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ మేరకు ఆమె హామీ ఇచ్చారు.