'రాజ్యాంగం ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది'
KMM: భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడిషనల్ డీసీపీ ఏఆర్ కుమారస్వామి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీ సునీల్ దత్ సూచనల మేరకు బుధవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనాన్ని చేపట్టారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.