'ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించి ఉన్నత లక్ష్యాలు సాధించాలి'
KRNL: ఆదోని మండలం అరెకల్‌లోని అంబేద్కర్ గురుకులం బాలికల వసతి గృహాన్ని SC కమిషన్ సభ్యుడు మేకల భిక్షం ఇవాళ తనిఖీ చేశారు. విద్య, భోజన సౌకర్యాలపై ఆరా తీసి అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులు ప్రభుత్వ అవకాశాలను వినియోగించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.