రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

SRCL: శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రం వేములవాడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లలో భారీగా భక్తులు బారులుతీరారు. ఈ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత అన్న పూజల సేవలను అధికారులు రద్దుచేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండటంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుందన్నారు.